![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1072 లో.... శేషు స్వీట్ తీసుకొని వచ్చి రేఖ వాళ్లకి ఇస్తుంటే గెలిచింది మనం కాదు.. ఆ ఇందు అని భ్రమరాంబ అంటుంది. ఇది ఇలాగే కొనసాగితే ఒకసారి మీ భవిష్యత్తు ఏంటో చూసుకోండి అని రేఖ వాళ్ళతో శేషు అనగానే ఊహల్లోకి వెళ్తారు. రేఖ, భ్రమరాంభ ఇద్దరు పనిమనుషుల్లాగా ఇంట్లో పనులు అన్ని చేస్తున్నట్లు ఉహించుకుంటారు. దాంతో ఊహలో నుండి బయటకు వచ్చి.. వద్దు బాబోయ్ అని రేఖ, భ్రమరాంబ అంటారు. అలా జరగకుండా చెయ్యాలని రేఖ అంటుంది.
మరొకవైపు అమ్మానాన్నకి నిజం చెప్పకుండా తప్పు చేసానని గిల్టీగా ఉందని నందుతో వెంకీ చెప్తూ బాధపడుతాడు. నువ్వు వెళ్లి ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పు.. అప్పుడే నువ్వు చేసే వర్క్ కంఫర్ట్ గా చేయగలవని నందు చెప్తుంది. మారొకవైపు చాలా థాంక్స్ బాబు నువ్వు వచ్చినప్పటి నుంచి మా ఇందులో ధైర్యం పెరిగింది.. తను అనుకుంది చెయ్యగలుగుతుందని రాజుతో అపర్ణ అంటుంది. ఈ హ్యాపీనెస్ ని బయటకు వెళ్లి సెలెబ్రేట్ చేసుకుందామని ఇందుతో రాజు అనగానే బయటకు ఏం వద్దు మీకు నచ్చిన స్వీట్ ఏంటో చెప్పండి అన్ని ఇంట్లోనే చేసి పెడతానని ఇందు అంటుంది. ఆ తర్వాత వెంకీ ఇంటికి వస్తాడు. లోపలికి వెళ్తుంటే టిప్పు ఎంత వచ్చిందిరా అని చలపతి అడుగగానే వెంకీ షాక్ అవుతాడు. నువ్వు మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన.. మా కొడుకుని మేం గుర్తుపట్టలేమా అని లక్ష్మీ అంటుంది. మీకు ఈ విషయం చెప్తే బాధపడతారనే చెప్పలేదని వెంకీ అంటాడు. నువ్వు రేపటి నుంచి అది మానేసి కోచింగ్ కి వెళ్ళమని చలపతి అంటాడు. అప్పుడే నందు ఎంట్రీ ఇస్తుంది. వద్దు అంకుల్ వాడిని మానెయ్యమని చెప్పొద్దూ.. ఇప్పుడిప్పుడే బయటప్రపంచం ఏంటో తెలుసుకుంటున్నాడని వాళ్లకి అర్ధం అయ్యేలా నందు చెప్తుంది.
దాంతో వాళ్ళు కూడా వెంకీ డెలివరీ బాయ్ గా చెయ్యడానికి ఒప్పుకుంటారు. మరొకవైపు ఇందు స్వీట్ తీసుకొని వచ్చి రాజుకి తినిపించాలని ట్రై చేస్తుంది. తరువాయి భాగంలో ఎప్పుడు నాకు సపోర్ట్ గా ఉంటానని మాటివ్వమని రాజుతో ఇందు అనగానే రాజు మాటిస్తాడు. ఆ తర్వాత అసలు వాళ్ళు భార్యాభర్తలు కాదని రేఖకి ఐశ్వర్య చెప్తుంది. దాంతో ఆ విషయం బయటపెట్టడానికి చలపతి ఇంటికి రేఖ తన మనిషిని పంపిస్తుంది. నీ కొడుకు దుగ్గిరాల ఇంటికి అల్లుడు అయ్యాడని అతను చెప్పగానే చలపతి, లక్ష్మీ భయపడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |